వివరణ ”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ
తిరుపతి, జూన్‌ 08, 2011

”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు

జూన్‌ 9వ తేదిన ”ఆంధ్రజ్యోతి ” దినపత్రిక నందు ప్రచురించిన ”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు.
 
సప్తగిరి మాసపత్రికల పంపిణీ – చందాదారులకు, ఏజెంట్లకు సక్రమంగాను, సకాలంలో జరుగుతోంది. ప్రతి నెల 20, 25 తేదీల మధ్యలో ముద్రణాలయం నుంచి పత్రికలు గోడౌనుకు చేరుతాయి. అనగా జూలై -2011 మాసపత్రికలు జూన్‌ 20, 25 మధ్య గౌడౌనుకు చేరుతాయి. వాటిని పోస్టల్‌ డిపార్టుమెంటు (ఆర్‌.ఎం.ఎస్‌.) వారు గోడౌను దగ్గరకే వారి వాహనంలో వచ్చి పంపిణీకి స్వీకరించి 10వ తేది లోపల దేశంలోని చందాదారులందరికీ అందజేస్తారు.

పోస్టల్‌ శాఖవారు అతి తక్కువ వ్యయంతో దేశవ్యాపితంగా, సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరిస్తున్నారు. పత్రిక 15 రోజుల జాప్యంతో అందుతోంది అన్నది అవాస్తవము.
 
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.