వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ
జూలై 21వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ”టి.టి.డి. ఛైర్మన్, ఇ.ఓలకు స్వర్ణ కంకణం ” అని ప్రచురించడం జరిగింది.
మైసూరు మహారాజు జయంతి సందర్భంగా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వెళ్ళి కర్ణాటక సత్రాల్లో పూజలు అందుకోవడం సంప్రదాయం.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక మంత్రులు టి.టి.డి ఛైర్మన్‌కి, కార్యనిర్వహణాధికారికి స్వర్ణ కంకణాలు తొడగడం జరిగింది. అయితే సదరు కంకణాలను తితిదే ఛైర్మన్, కార్యనిర్వహణాధికారులు వెంటనే సదరు కంకణాలను ఆలయ పారపత్తేదారు ద్వారా ఆలయానికి శ్రీవారి కానుకగా అందజేశారని తెలియజేస్తున్నాం.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి