వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
వివరణ

తిరుపతి, 2010 ఆగష్టు 25: ఆగష్టు 24వ తేదిన ”ఈనాడు” దినపత్రిక నందు ప్ర‌చురించిన ”ప్రత్యేక పాలనా….పాలక మండలా…?, నాకే అవకాశం కల్పించాలి. ఇ.ఓ.కృష్ణారావు అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం. రమణాచారికంటే తానే సీనియర్‌ అయినందున చైర్మన్‌గా తనకే అవకాశాలు ఇవ్వాలని తితిదే ఇ.ఓ.కృష్ణారావు ప్ర‌భుత్వానికి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది అని కూడా ప్రచురించిన వార్త నిజం కాదు. అసలు ఇ.ఓ. ప్రభుత్వానికి ఎటువంటి లేఖ వ్రాయ‌కపోయినా, వ్రాసినట్లు వార్త ప్రచురించడం బాధాకరం.

కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికలో ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి