వివరణ _ ”తిరుమలేశుని క్యాలెండర్లు కొనేవారే లేరా!” వార్త సరికాదు

”తిరుమలేశుని క్యాలెండర్లు కొనేవారే లేరా!” వార్త సరికాదు

విషయం :- 26-3-09వ తేదిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ”తిరుమలేశుని క్యాలెండర్లు కొనేవారే లేరా!” అని ప్రచురించిన వార్త సరికాదు.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో గురువారం నాడు ”తిరుమలేశుని క్యాలెండర్లు కొనేవారు లేరా?” అనే శీర్షికతో ప్రచురించిన వార్తా కథనం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం. రెండు లక్షల క్యాలెండర్లు మిగిలిపోయాయని గతంలో వీటిని రహస్యంగా అమ్మారని, వీటికోసం ”పైరవీలు” నడిచాయని పేర్కొనడంకూడా అవాస్తవం.

తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం పది లక్షల యాబై ఐదువేల క్యాలెండర్లు ముద్రించగా, అందులో కేవలం ఆరువేల ఐదు వందల క్యాలెండర్లు మాత్రమే నిలువయున్నాయి. వాటిని కూడా తెలుగు నూతన సంవత్సరం, తమిళ నూతన సంవత్సరం పర్వదినాలకోసం నిలువయుంచడం జరిగింది. వీటిలో శ్రీవేంకటేశ్వరస్వామివారు 3,50,000 (పెద్దసైజు), శ్రీవేంకటేశ్వరస్వామివారు, శ్రీపద్మావతి అమ్మవారు (చిన్నసైజు) కలిపి 2,50,000 శ్రీపద్మావతి అమ్మవారు (పెద్దసైజు) 10,000, పంచాంగం క్యాలెండర్లు 70,000, 12 షీట్‌ క్యాలెండర్లు 3,75,000 కాగా మొత్తానికి 10,55,000 క్యాలెండర్లు ముద్రించడం జరిగింది.

ఈవివరణను ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని మనవి చేయుచున్నాను.

కె.రామపుల్లారెడ్డి
తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి