వివరణ(24-1-2009 )

”అన్నదాన బియ్యం నాణ్యతకు తిలోదకాలు” అను వార్త వాస్తవం కాదు

జనవరి 24వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ”అన్నదాన బియ్యం నాణ్యతకు తిలోదకాలు” అను వార్త వాస్తవం కాదు.

నల్గొండజిల్లా సూర్యాపేటకు చెందిన వేంకటేశ్వరట్రేడర్స్‌వారికి 3లక్షల కిలోల సోనామసూరి (సన్నవి) సరఫరా చేయడానికి 19.12.2008న ఉత్తర్వులు జారీచేయడమైనది. వారు వెంటనే సరఫరా మెదలుపెట్టి నాణ్యతగల బియ్యాన్ని సరఫరా చేస్తూవున్నారు. సాధారణంగా ప్రతి టెండరు దార్లు బియ్యమును టిటిడి ఆరోగ్యశాఖాధికారి ఆధీనంలో ఉన్న పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మార్కెటింగ్‌ గౌడన్‌కు వచ్చి సరఫరా చేసిన బియ్యం శాంపిల్‌ను తీసుకొని, సీలువేసి నాణ్యత పరీక్షకు తిరుమల లేబరేటరికి పంపిన అనంతరము ల్యాబ్‌ రిపోర్టు సదరు ఆరోగ్యశాఖాధికారి కక్షుణంగా తనిఖీచేసి, దానిని మార్కెటింగ్‌ శాఖకు పంపడం జరుగుతుంది. ఇది ప్రతినిత్యం తప్పనిసరిగా జరిగే ప్రక్రియ. ల్యాబ్‌ రిపోర్టులో సదరు బియ్యం నాణ్యతలేదని, తిరస్కరించమని ఆరోగ్యశాఖాధికారి నివేదిక అందినచో సదరు టెండరుదారుకు నోటీసు రూపంలో సదరు కోడ్‌నెంబరు సరుకును తిరస్కరిస్తూ వాపసు తీసుకెళ్ళాల్సిందిగా కోరుతాము.

అయితే సూర్యాపేటకు చెందిన వేంకటేశ్వర ట్రేడర్స్‌వారు సరఫరాచేసిన కోడ్‌నెంబరు    ఙ-14 గల బియ్యమును తిరుమలకు పంపగా, సదరు సరుకులో నాణ్యత లేదని, ఆరోగ్యశాఖాధికారి దృవీకరించిన ల్యాబ్‌రిపోర్టు అందినవెంటనే శ్రీ వేంకటేశ్వర ట్రెడర్స్‌వారికి వ్రాతపూర్వకంగా సరుకు వెనక్కుతీసుకెళ్ళమని 22-1-2009తేదిన తెలియచేయడమైనది. సదరు టెండరు దారు 23-01-2009న తిరస్కరింపబడిన ఆసరుకు మొత్తాన్ని వెనక్కుతీసుకెళ్ళడం జరిగినది. అంతేగాని తిరస్కరించబడిన ఏసరుకునైనా కకూడా మరలా తీసుకోవడం జరుగదు. తిరస్కరించిన పిమ్మట సదరు టెండరుదారు నుండి రెగ్యులర్‌గా రావలసిన బియ్యం కూడా ఈరోజు వరకు సప్లయి చేయలేదు. అయితే సదరు వార్తల్లో తిరస్కరించబడిన సరకును సదరు టెండర్‌ దారులతో అధికారులు కుమ్మకై తిరిగి తీసుకున్నారనే ఆరోపణ చేయడం దారుణం, బాధాకరం.

కనుక పై తెల్పిన వాస్తవాలను రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే, ప్రజాసంబందాధికారి
తి.తి.దేవస్థానములు, తిరుపతి.
తిరుపతి.