వివరణ(30-1-2009)

”సబ్‌ స్టేషన్‌ కాంట్రాక్ట్‌పై డి.కె. ఒత్తిడి” అనే వార్తకు వివరణ

విషయం:- 30-1-2009వ తేదీన వార్త దినపత్రిక చిత్తూరుజిల్లా ఎడిషన్‌లో ”సబ్‌ స్టేషన్‌ కాంట్రాక్ట్‌పై డి.కె. ఒత్తిడి” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ.

తిరుమల తిరుపతి దేవస్థానములో ఇంజనీరింగ్‌ పనులను నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌లకు అప్పగించడం జరుగుతుంది. తిరుమలలో ఒక సబ్‌ స్టేషన్‌ కాంట్రాక్టు పనిని పలానా వ్యక్తులకు అప్పగించాలని తి.తి.దే, ఛైర్మెన్‌ ఒత్తిడి తెచ్చినట్లు వార్తా కథనంలో పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. అదేవిధంగా, తి.తి.దే చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీకోటేశ్వరరావు ఆవేదనకు గురయ్యాడని పేర్కొనడం కూడా వాస్తవం కాదు.

తి.తి.దే ఇంజనీరింగ్‌ అధికారులు బడ్జెట్‌ కేటాయింపులు, పనుల అమలు విధానం తదితర విషయాలలో ఛైర్మెన్‌ను, కార్యనిర్వహణాధికారిని తరచుగా కలవడం సర్వసాదారణం. వారు నిరసనను తెలియజేశారని వార్తలో పేర్కొనడం కూడా పూర్తిగా అవాస్తవం.

ఈ వివరణను మీ పత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని మనవి చేయుచున్నాను.

తి.తి.దే,ముఖ్య ప్రజాసంబందాధికారి
తి.తి.దేవస్థానములు, తిరుపతి.
తిరుపతి.