వివరణ_  ”ఆకలి తీర్చవా గోవిందా…!” అను వార్త వాస్తవ దూరం

వివరణ

 ”ఆకలి తీర్చవా గోవిందా…!” అను వార్త వాస్తవ దూరం

విషయం :- మార్చి 26వ తేదిన వార్త దినపత్రిక నందు ప్రచురించిన ”ఆకలి తీర్చవా గోవిందా…!” అను వార్త వాస్తవ దూరం.

టిటిడి కాంట్రాక్టార్‌గా వ్యవహరిస్తున్న ముంబయికి చెందిన ఆల్‌ సర్వీసస్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు డిశెంబర్‌ వరకే జీతాలు ఇచ్చారని, ఆతర్వాత జీతాలు ఇవ్వలేదని సదరు వార్తలో పేర్కొనడం సరికాదు. అయితే సదరు కాంట్రాక్టర్‌ నుండి ఏటియం కార్డు కల్గిన ప్రతి కార్మికుడికి ఫిబ్రవరి వరకు జీతాలు ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కూడా ఏటియం కార్డులు పొందిన వెంటనే జీతాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సదరు ముంబయికి చెందిన ఆల్‌సర్వీసస్‌ సంస్థ కార్మికులు జీతాలు ప్రతినెలాక్రమం తప్పకుండా, ఎటువంటి ఆలస్యలేకుండా చెల్లించాలని ఆదేశాలు జారీచేసినట్లు తితిదే ఛీఫ్‌ ఇంజనీరు శ్రీవి.ఎస్‌.బి.కోటేశ్వరరావు తెలిపారు.

కనుక పై విషయాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాను.

టి.రవి
తి.తి.దే,ప్రజాసంబందాధికారి