విశాఖ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా రెండో రోజు వైదిక కార్యక్రమాలు
విశాఖ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా రెండో రోజు వైదిక కార్యక్రమాలు
తిరుపతి, 2022 మార్చి 19: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు శనివారం ఉదయం నుంచి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమ కార్యమాలు చేపట్టారు. రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుబట్టాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.