MERITORIOUS AWARDS TO 15 VIGILANCE STAFF _ వృత్తి నైపుణ్యం క‌న‌బ‌రిచిన 15 మంది భ‌ద్ర‌తా సిబ్బందికి అవార్డులు

Tirumala, 19 Jan. 22: TTD CVSO Sri Gopinath Jatti on Wednesday presented meritorious awards to 15 Security and vigilance staff at the PAC-4 command control room in Tirumala.

The awards were given to best performers who assisted devotees during heavy rains at GNC toll gate, Ghat roads, rescuing missing children and aged persons and reuniting them with their families, returning missing cellphones and gold ornaments after investigations through CCTV footage back to its owners etc.

VGO Sri Bali Reddy, all sector AVSOs and VIs of Tirumala and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వృత్తి నైపుణ్యం క‌న‌బ‌రిచిన 15 మంది భ‌ద్ర‌తా సిబ్బందికి అవార్డులు

తిరుమ‌ల‌, 2022 జనవరి 19: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చిన భ‌క్తుల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించి వృత్తి నైపుణ్యం క‌న‌బ‌రిచిన 15 మంది నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందికి టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి బుధ‌వారం మెరిటోరియ‌స్ అవార్డులు అంద‌జేశారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గల క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

 భ‌క్తులు పోగొట్టుకున్న బంగారు, వెండి వ‌స్తువుల‌ను సిసి టివిల ద్వారా వెతికి ఇవ్వ‌డం, భ‌క్తులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు తిరిగి అందించ‌డం, త‌ప్పిపోయిన చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల‌ను తిరిగి వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌డం, భారీ వ‌ర్షాల స‌మ‌యంలో జిఎన్‌సి టోల్‌గేట్‌, ఘాట్ రోడ్డులో ఉత్త‌మంగా విధులు నిర్వ‌హించిన‌వారికి ఈ అవార్డులు అందించారు.

అవార్డులు అందుకున్న‌వారిలో శ్రీ కెజె.నాగ‌రాజు, శ్రీ వి.ర‌ఘునాథ‌రెడ్డి, శ్రీ ఎస్‌.సుధాగ‌ర‌న్‌, శ్రీ కె.వాసు వ‌ర్మ‌, శ్రీ బి.ఉద‌య్‌కుమార్‌, శ్రీ ఆర్‌.కుమార్‌, శ్రీ సి.దుర్గ‌శ్రీ‌, శ్రీ పి.హ‌రినాథ్‌, శ్రీ వి.ర‌ఘు, శ్రీ డి.శ్రీ‌నివాసులు, శ్రీ పి.వాణి, శ్రీ ఎన్ఆర్‌.స‌హ‌దేవ‌రెడ్డి, శ్రీ ఎస్‌.రెడ్డి కిషోర్‌, శ్రీ వి.వెంక‌టేష్‌, శ్రీ ఎస్‌.ప‌ల‌ణికుమార్ ఉన్నారు.

ఈ కార్య‌క్రమంలో టిటిడి విజివో శ్రీ జి.బాలిరెడ్డి, వివిధ సెక్టార్ల ఏవిఎస్వోలు, విఐలు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.