SASTIPURTI CELEBRATIONS HELD FOR TIRUMALA JUNIOR PONTIFF IN TIRUPATI _ వేడుకగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారి షష్టిపూర్తి మహోత్సవం
Tirupati, July 14, 2021: The Shastipurti Mahotsavam of Tirumala Junior Pontiff Sri Sri Sri Govinda Ramanuja Chinna Jeeyarswamy was celebrated in a religious manner at Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday.
TTD EO Dr KS Jawahar Reddy participated in the festivities and took the blessings from the seer on the occasion.
As part of the celebrations, the Nalayar Divya Prabhandam Parayanam was being recited at the Chinna Jeeyar Swamy Mutt since July 10 every day between 9am and 10:30am. The pontiff was felicitated with Prasadam and Garlands from several Sri Vaishnava mutts as an honour on the occasion of his Shastipurti Mahotsavam.
It may be mentioned here that Sri Sri Sri Govinda Ramanuja Chinna Jeeyarswamy was born in 1961 at Tirukkurmozhi in Tirunelveli district of Tamilnadu and underwent Vedic education at Srirangam. For 30 years he imparted his Vedic knowledge to many as a Vedic teacher. He adorned the much coveted religious role as the Chinna Jeeyarswamy of Tirumala temple a decade ago and has been supervising the daily rituals at Sri Venkateswara temple since then along with Sri Sri Sri Pedda Jeeyarswamy of Tirumala.
Special grade DyEO Sri Rajendrudu, other office staff, disciples of Chinna Jeeyar Swamy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వేడుకగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారి షష్టిపూర్తి మహోత్సవం
తిరుపతి, 2021 జులై 14: శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామివారి షష్టిపూర్తి మహోత్సవం బుధవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల శ్రీ చిన్నజీయర్ మఠంలో వేడుకగా జరిగింది. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
షష్టిపూర్తి మహోత్సవంలో భాగంగా జులై 10వ తేదీ నుండి మఠంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణం జరుగుతోంది. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నాళాయిర దివ్యప్రబంధం పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ దివ్యదేశాల నుండి తీసుకొచ్చిన ప్రసాదం, పుష్పమాల మర్యాదను శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారు స్వీకరించారు.
శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారు 1961వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా తిరుక్కుర్‌ముడి అనే దివ్యదేశంలో జన్మించారు. శ్రీరంగంలో వైదిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 30 సంవత్సరాల పాటు అధ్యాపక కైంకర్యం నిర్వహించారు. భగవదనుగ్రహంతో పదేళ్ల క్రితం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి బాధ్యతలు స్వీకరించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారితో కలిసి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల కైంకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు ఇతర అధికారులు, మఠం సిబ్బంది పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.