VEDAS REFLECTS PRESENCE OF GOD-CHAGANTI _ వేదం భగవత్ స్వరూపం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Tirupati, 12 January 2020: Renowned philosopher and spiritual exponent Brahmarshi Chaganti Koteshwar Rao advocated that Vedas are the true form of divine message of God for universal well-being and peace and they reflect His presence.

During his religious discourse on the theme Veda culture and Bhakti Vaibhavam at the Geeta Jayanti platform of SV high school grounds on Sunday evening he said Vedic practices were scientific and as per tenets of Dharma and one who followed the Vedas will gain Atma Jnanam which will lead everyone to Moksha.

He lauded the efforts and campaign initiated by TTD for promotion, protection and propagation of Vedas.

Earlier Vedic pundits of SV Higher Vedic Studies Institute (SVHVSI) presented one hour long Veda Swasti of all four Vedas. OSD SVHVSI Dr Vibhishana Sharma presided over the event in which large number of citizens of Tirupati participated.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

వేదం భగవత్ స్వరూపం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

తిరుప‌తి, 2020 జనవరి 12: వేదం భగవంతుని స్వరూపమని, విశ్వమాన‌వ శ్రేయ‌స్సు కోస‌మే భ‌గ‌వంతుడు వేదాల‌ను సృష్టించాడ‌ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో గ‌ల గీతా జ‌యంతి వేదిక‌పై టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం” అనే అంశంపై రెండు రోజులపాటు జరుగనున్న ధార్మికోపన్యాసాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ వేదోక్తంగా ఆచ‌రించే క‌ర్మ‌ల‌న్నీ ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన‌వని, శాస్త్రీయ‌మైన‌వని పేర్కొన్నారు. ధ‌ర్మానికి మూలం వేదాలేన‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ధ‌ర్మ‌బ‌ద్ధంగా కోరిక‌లు తీర్చుకోవాల‌ని, అప్పుడే ఆత్మ‌జ్ఞానం క‌లుగుతుంద‌ని వివ‌రించారు. ఆత్మ‌జ్ఞానంతో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌న్నారు. వేద పరిరక్షణ, ప్రచారం కోసం టిటిడి విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు.

ముందుగా ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థకు చెందిన వేదపండితులు ఒక గంట పాటు నాలుగు వేదాలతో వేదస్వస్తి నిర్వహించారు.

ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.