వేదాలు పురాణ ఇతిహాసాల‌ను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ

వేదాలు పురాణ ఇతిహాసాల‌ను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ

తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద సదస్సులో రెండవ రోజు సమావేశంలోని రెండవ పత్రంలో పత్ర సమర్పకులు సమర్పించిన వివరాలు – ఈ సదస్సు అగస్త్యవేదికలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యకక్షులుగా శ్రీ విశ్వనాధగోపాలకృష్ణశాస్త్రి రాజమండ్రి గారు విచ్చేసారు.

మొదటగా శ్రీమార్తి సత్యనారాయణశర్మ హైదరాబాదు వాస్తవ్యులు ”వేదములు అతీంద్రియ విజ్ఞానం” గురించి ఉపన్యసించారు.

కృష్ణయజుర్వేద ఉపోద్ఘాత భాష్యంలో దీనిని గురించిన విశేష ప్రస్తావనలున్నాయి. ఐహికము – ఆముష్మికము సంబంధించిన వాటి ప్రాప్తి పొందడానికి తగిన విధంగా ఈ వేదాలు ఉపకరిస్తాయన్నారు. తైత్తిరీయ బ్రాహ్మణం ద్వారా కన్యా లాభ ఫలాన్ని పొందేమార్గం సూచింపబడి వుందని పేర్కొన్నారు. ఇష్ట కన్యాప్రాప్తి ఇవి ఐహికమైన వాటి క్రింద వస్తాయి రోగవిముక్తిగాను తైత్తిరీయ బ్రహ్మణంలోని కొన్ని అనువాకములు సామాన్య జీవితంలో మానవుడు ఉపయోగించి లబ్ది పొందిన ఉదాహరణాలు పేర్కొన్నారు. వేదవ్యాసుల వారి మహాభారతంలో కూడా మానవునికి కావల్సిన రీతిలో ఉపకరించే విషయాలందిచ్చాయి. వేదాలకు అపార్థాలు చెప్పకుండా ఇతిహాసపురాణాలు రక్షిస్తాయని స్పష్టం చేశారు. శ్రుతి స్మృతి పురాణాలు ఈ విషయాన్ని గురించి ఆధునిక రీతిలో కూడా అధ్యయనం కావించారు. వేరు వేరు కులాల రక్తాలను సేకరించి పరీక్షలు జరిపి మీ జన్యువులు తెలియజేస్తాయని ఇండియా టుడే డిశెంబర్‌ 15, 1981 లో ఈ విషయాలను ప్రచురించింది. మృత దేహశరీరాలను జన్యువులను తీసి వాటిని పరీక్షించ కొంకళాదేహానికి చెందిందిగా ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. వేదం ఏదైనా చెబితే అందులో సత్యం ఉంటుందని వ్యక్తీకరించారు.

కాంచీపురంలోని ఏకాంబర వృక్షంలో నాలుగు కొమ్మలకి నాలుగు రకాల పండ్లు వస్తాయి. ఇటువంటి వాటి గురించి పరిశోధనల ద్వారా నూతన విషయాలు తెలుస్తాయి. జగదీష్‌ చంద్రబోసు వృక్షాలకు స్పందన వుంటుందా లేదా అనే విషయంపై అనేక పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత నిరూపణలో వీరు వేదాల ద్వారా ఎన్నో విషయాలను ప్రయోగాల ద్వారా వివరించారు. వేదంలోని ప్రతీ మంత్రం అతీంద్రీయ జ్ఞానం గురించి బోదిస్తుందన్నారు. వేద సత్యమని భావించేవారు, వేదాన్ని విశ్వసించేవారు, ఈ అతీంద్రీయ విజ్ఞానాన్ని తెలుసుకొనేందుకు ఇటువంటి వేదికల ద్వారా ఇచ్చే ఉపన్యాసాలు ఉపకరిస్తాయన్నారు. వేదపండితులకు ప్రపంచ వ్యాపారాలు పట్టవు అంటారు కాని ఫారిన్‌ సైంటిస్టులు, ఆంగ్ల పత్రికలను చదివి అవగాహన చేసుకొనే స్థాయికి వేదాలు అభివృద్ధి చెంది వుందన్నారు.

నందీబయుమతి గ్రహీత శ్రీ ఆర్‌.వి.ఎస్‌.ఎస్‌. అవధానులు వేద భారతితో ప్రచారంలో వున్నారు. ”వేదములు – కంప్యూటర్‌ విజ్ఞానం” దక్షిణ అమెరికాలో చిలీ ప్రాంతంలో వచ్చిన భూకంపం రెక్టారు స్కేలు 8.8 కొన్ని లక్షల అటాంబాబు శక్తి కలది ఆధునిక విజ్ఞానం ఈ భూకంపాన్ని ఒక నిమిషం ముందు కూడా చెప్పలేమన్నారు. బృహత్యంహిత్‌ లో భూకంపం ఒక వారం రోజుల ముందట చెప్పవచ్చని పేర్కొన్నారు. భూకంపాలు సముద్రాలలో ఎక్కువ వస్తాయి దాదాపు 1500 వందల భూకంపాలను గురించి వీరు పరిశోధన చేయించారు. క్రీ.శ. 365 నుండి సునామీకి సంబంధించిన విషయాలు వెలికి వచ్చాయని అన్నారు. శని,ఆదివారాలలో భయంకర భూకంపాలు వస్తున్నాయి. చతుర్థశిత్రయోదశీ, పాడ్యమి తదియలో వస్తున్నాయ, ధనుర్లగ్నం కర్నాటక లగ్నంలో ఎక్కువగా వస్తున్నట్లుగా గుర్తించారు.

మఖ నక్షత్రానికి దగ్గరలో ఇవి ఏర్పడుతున్నాయన్నారు. కనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు సాధించలేనిది వేదాలు జ్యోతిష్యం ద్వారా సాధించి పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు. అనంతరం పండిత సత్కారం నిర్వహించారు. వందన సమర్పణతో రెండవ రోజునాటి రెండవ సత్రం పూర్తయింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.