EXTENSIVE PREPARATION FOR DEVOTEE FACILITATION DURING VAIKUNTA EKADASI- TTD ADDITIONAL EO _ వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 30 Dec. 19: TTD Additional Executive Officer Sri AV Dharma Reddy said that TTD had unleashed all out coordination of all departments for devotees Darshan during the most important festival day on Vaikuntha Ekadasi which falls on January 6.

Addressing a review meeting at Annamaiah Bhavan on Monday the Additional EO said on December 31 and January 1, TTD has cancelled all arjita sevas and privileged darshans for senior citizens, physically challenged, parents with infants, besides tokens for sarva darshan, Divya Darshan and Anga pradakshina.

He said nearly 5000 tickets were issued for special darshan ₹300/- in on-line for Vaikunta dwadasi on January 7 while all other darshans along with SSD and DD tokens stand cancelled. 

Vaikuntadwara darshan will commence at 2.00 am onwards on January 6 while for common pilgrims after 5am. He said the Ghat road would remain open the whole day on January 5 for Vaikuntha Ekadasi.

An action plan is being laid down for the distribution of Anna Prasadam to devotees waiting in VQC queue lines, compartments, and mada street gallery sheds. Nearly three lakh water bottles are kept ready for disbursement on Ekadasi day, he said.

NAMASANKEERTANA YAGNAM

TTD has plans to roll out Namasankeertana Yagnam from 11 am till midnight on January 5 in the sheds of Narayanagiri Gardens for the benefit of devotees waiting for Vaikunthadwara Darshan. The artists of HDPP, Annamacharya, Dasa Sahitya Project and SV College of music and dance will perform Govindanamas, Vishnusahasra Parayanam, sankeertans etc to keep pilgrims engaged in Bhakti Sangeet, the Additional EO added.

Earlier the Additional EO reviewed the department wise arrangements and directed Srivari temple, vigilance and security, Police to make coordinated efforts to ensure smooth darshan to all devotees. 

He also directed officials to organise attractive flower and electrical decorations and keep adequate stock of laddu Prasadam and also that the Radio and broadcasting department to make proper announcements on all arrangements for devotees.  

TTD Chief Engineer Sri Ramachandra Reddy, Additional CVSO Sri Shiva Kumar Reddy, SE-2 Sri Nageswara Rao, SE (Electrical) Sri Venkateswarlu, IT chief Sri Sesha Reddy, DyEO of Srivari temple Sri Harindranath, HDPP Secretary Acharya Rajagopalan, Health officer Dr R R Reddy and others also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల,  2019, డిసెంబ‌రు 30: నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది, జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల సౌక‌ర్యార్థం అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమ‌వారం టిటిడిలోని వివిధ విభాగాల అధికారులతో అద‌న‌పు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో అన్ని ఆర్జిత‌సేవ‌ల‌తో పాటు దాత‌లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల ద‌ర్శ‌నాలు, స‌ర్వ‌ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం, అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్లు ర‌ద్దు చేసిన‌ట్టు తెలిపారు. వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు ఆర్జిత‌సేవ‌ల‌తో పాటు ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు, రూ.300/- ద‌ర్శ‌న టికెట్లు, స‌ర్వ‌ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం, అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్లు ర‌ద్దు చేశామ‌ని వివ‌రించారు. జ‌న‌వ‌రి 7న వైకుంఠ ద్వాద‌శి నాటికి 5 వేల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు ఆన్‌లైన్‌లో ఇదివ‌ర‌కే భ‌క్తుల‌కు కేటాయించామ‌న్నారు. జ‌న‌వ‌రి 6న ఉద‌యం 2 గంట‌ల నుండి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో గ‌ల షెడ్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా అన్న‌ప్ర‌సాదాల పంపిణీ ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. ఏకాద‌శి నాడు 3 ల‌క్ష‌ల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

నామసంకీర్త‌న య‌జ్ఞం

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక అనుభూతి క‌ల్పించేందుకు జ‌న‌వ‌రి 5న ఉద‌యం 11 గంట‌ల నుండి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు నామ‌సంకీర్త‌న య‌జ్ఞం నిర్వ‌హిస్తామ‌ని శ్రీ ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. ఇందులో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ 3 షెడ్ల‌లో, అన్న‌మాచార్య ప్రాజెక్టు 2 షెడ్ల‌లో, దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత క‌ళాశాల ఒక్కో షెడ్డులో గోవింద నామ‌సంకీర్త‌న, భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాయ‌ని వివ‌రించారు.

అంత‌కుముందు విభాగాల వారీగా అద‌న‌పు ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌, సెక్యూరిటీ, పోలీస్‌ అధికారులు సమన్వయం చేసుకుని భక్తులందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆకర్ష‌ణీయంగా పుష్పాలంకరణ చేపట్టాలన్నారు. భక్తులకు సరిపడా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని, టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులకు తెలిసేలా రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ శాఖ ద్వారా అనౌన్స్‌మెంట్‌లు ఇవ్వాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీశేషారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, విఎస్‌వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌రావు,  ఆరోగ్యశాఖాధికారి డా|| ఆర్‌ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ నాగ‌రాజు, శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, శ్రీ బాలాజి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.