RATHOTSAVAM OBSERVED _ వైభవంగా గోవిందుడి రథోత్సవం
Tirupati,2, June,2023:On the penultimate day of the ongoing annual fete in Sri Govindaraja Swamy temple in Tirupati on Friday, the grand Rathotsavam took place.
Later Snapana Tirumanjanam was performed to Utsava deities.
Both the seers of Tirumala, Kankanabhattar Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా గోవిందుడి రథోత్సవం
తిరుపతి, 2023 జూన్ 02: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే.
అనంతరం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎ సిఏవో శ్రీ బాలాజి, సిఈ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, , ఏఈవో శ్రీ రవికుమార్, సూపరిండెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.