GOVINDARAJA SWAMY TEPPOTSAVAM BEGINS WITH GRANDEUR _ వైభవంగా శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

Tirupati, 17 February 2024: Sri Govindaraja Swamy temple annual Theppotsavam commenced with grandeur on Saturday.

In this Float festival which was held between 6.30 pm to 8 pm, on the first day Sri Kodandarama Swamy along with Sita Lakshmana went for a procession on the finely decked float in the Pushkarini. 

The devotees had darshan of deities who went five rounds. 

On this occasion, bhajans, Harikatha and music programs were organized under the auspices of TTD’s Hindu Dharmaprachara Parishad and Annamacharya Project.

AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Narayana, Temple Inspector Sri Dhananjaya, other officials and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 ఫిబ్ర‌వరి 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు శ‌నివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ మునికృష్ణ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయ‌ణ‌,టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌య‌, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.