SITA JAYANTHI OBSERVED AT VONTIMITTA _ వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

Tirupati, 17 May 2024: The origin ceremony of Sri Sita Devi on the auspicious Vaisakha Navami Tithi Sri Sita Jayanti was observed in Sri Kodandaramaswamy Temple at Vontimitta on Friday.
 
As part of this Tirumanjanam was performed for the Utsava deities. After that, Vyasabhisheka, Aradhana and Archana were performed to the Moolavarulu.
 
As part of the festivity, the Ranga Mandapam of the temple spruced up beautifully and the idols of Sri Sita Rama Lakshmana were offered Vishvaksena Puja, Vasudeva Punyahavachanam, Aradhana.
Later “Vasantika Pooja”- reciting Sahasranama Archana with jasmine flowers was performed for Seetha Devi with utmost religious fervour on the occasion.
 
DyEO Sri Natesh Babu,  Special Officer and DyEO Smt Prasanthi, VGO Sri Bali Reddy and others, devotees were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి, 2024 మే 17: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంత‌రం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ఆరాధ‌న, నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ న‌గేష్‌బాబు, శ్రీమతి ప్రశాంతి, విజివో శ్రీ బాలి రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.