SOMASKANDAMURTI ON VYAGHRA VAHANAM _ వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 06 March 2024: On the sixth day of the ongoing annual Brahmotsavam of Sri Kapileswara Swamy in Tirupati Sri Somaskandamurthy graced the devotees on the Vyaghra Vahanam.  

Afterwards, the priests performed Snana Tirumanjanam.  Sri Somaskandamurthy and Sri Kamakshi Devi were specially rendered abhishekam with milk, curd, honey, fruit juices and sandalwood.

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి

తిరుప‌తి, 2024, మార్చి 06: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ సోమస్కంద‌మూర్తి వ్యాఘ్ర వాహనంపై భ‌క్తుల‌ను అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి.

అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.