VISHNU KAMALARCHANA HELD _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా విష్ణుక‌మ‌లార్చ‌న‌

Tirumala, 28 Nov. 20: As part of the month-long Karthika Masa Deeksha program organised by TTD at Vasanta Mandapam in Tirumala, Vishnu Kamalarchana was observed on Saturday.

Agama Advisor Sri Mohana Rangacharyulu said, the prayers offered to Lord Vishnu with lotuses will provide prosperity and health.

Agama Advisor Sri Sundaravaradan, Chief Priests Sri Venugopala Deekshitulu were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా విష్ణుక‌మ‌లార్చ‌న‌

తిరుమల‌, 2020 నవంబరు 28: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శ‌ని‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో విష్ణుక‌మ‌లార్చ‌న(వైకుంఠ చ‌తుర్ద‌శి పూజ, క‌మ‌ల‌ముల‌తో కేశ‌వ‌పూజ‌) శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ క‌మ‌లం శ్రీ‌మ‌హాల‌క్ష్మికి ప్ర‌తీక అని, శ్రీ‌వారి వ‌క్షఃస్థ‌లంలో అమ్మ‌వారు కొలువై ఉంటార‌ని తెలిపారు. అమ్మ‌వారికి ప్రీతిపాత్ర‌మైన క‌మ‌లాల‌తో వెయ్యిసార్లు అర్చించ‌డం ఈ పూజ విశిష్ట‌త అని తెలియ‌జేశారు. ఈ పూజ‌లో పాల్గొన్న వారికి దీర్థాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతాయ‌ని వివ‌రించారు.

ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.