SRI SADHU SUBRAMANYAM SHASTRY 135th JAYANTHI HELD _ శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి :•⁠ ⁠ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి

HERALDED SRIVARI GLORY EMBEDDED IN INSCRIPTIONS

Tirupati,17 December 2023: Eminent epigraphist Sri Sadhu Subramanyam was paid rich tributes on his 135th Birth Anniversary.

He was hailed by scholars for translating the inscriptions of the Srivari temple and heralding the glory of Sri Venkateswara Swamy across the globe.

Participating in the 135 Jayanti celebrations of Sri Sadhu Subramanya Sastry held at Annamacharya Kalamandiram Scholar Sri Krishna Reddy said  Sri Subramanya Sastry had brought out and translated over 1000 inscriptions at Srivari temple and also credited for unearthing Annamacharya Sankeertans (12,000 of 32,000 sankeertans that were discovered so far) and dedicated them to the society.

Earlier TTD CAuO Sri Sesha Shailendra highlighted the works of eminent scholars like Sri Sadhu Subramanya Sastry, Sri Veturi Prabhakara Shastry and Sri Rallapalli Ananta Krishna Sharma and said their life and contributions should inspire both senior citizens and youth.

Thereafter prominent journalist Sri Ma Sharma presented a lecture on  ‘ Shastri’s Multifaceted acumen ‘.

Earlier CVSO Sri Narasimha Kishore and PRO Dr T Ravi paid floral tributes and garlanded the life-size bronze statue of Sri Sadhu Subramanya Sastry located at the SVETA Bhavan in Tirupati on Sunday.

Daughter of Sri Shastri Smt Girija, Grandson and Judge Sri Murthy and Director of Annamacharya Project Dr Akella Vibhishana Sharma were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి :

•⁠ ⁠ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి

•⁠ ⁠135వ జయంతి సంద‌ర్భంగా ఘనంగా నివాళులు

తిరుపతి, 2023 డిసెంబర్ 17: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని ప్రముఖ శాసన పరిశోధకులు తొండవాడకు చెందిన శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి తెలిపారు.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జయంతి సభ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి ఉప‌న్య‌సిస్తూ, శ్రీవారి ఆలయం ఉన్నంతవరకు ఆయన చిరంజీవిగా నిలుస్తారన్నారు. టీటీడీలో చిన్న స్థాయి ఉద్యోగిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో 12 వేల సంకీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శాస్త్రి పరిష్కరించి సమాజానికి అందించినట్లు ఆయన వివరించారు.

అంతకుముందు టీటీడీ సిఏఓ శ్రీ శేష శైలేంద్ర మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషిని విద్యార్థులు తప్పని సరిగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. వీరి సేవలు తెలుసుకుని సమాజానికి ఉపయోగపడే వారిలా మారితేనే చదువుకు సార్థకత లభిస్తుందని ఆయన చెప్పారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు కూడా చదవాలన్నారు.

అనంతరం ప్రముఖ పాత్రికేయులు శ్రీ మా శర్మ “శాస్త్రి గారి బహుముఖ ప్రజ్ఞ” అనే అంశంపై ఉపన్యసించారు.

పుష్పాంజలి :

అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 135వ జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి.రవి తదితరులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు శ్రీ విభీషణ శర్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.