SACRED CHATURVEDA HAVANAM BEGINS _ శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం

Tirupati, 29 June 2023:  The Parade Grounds of the TTD Administration Building in Tirupati on Thursday resounded with chanting of Veda Mantras as the celestial week long Chaturveda Havanam organised seeking global harmony commenced on a grand religious note in the temple city.

 

The Rutwiks performed Kalasa Sthapana, and Kalasa Avahana followed by Yajamani Sankalpa, Ganapati Puja and Agni Pratista rituals.

 

As 32 Rutwiks chanted vedic mantras from all four Vedas, TTD EO Sri AV Dharma Reddy and JEO for Health and Education Smt Sada Bhargavi offered Sankalpam at the program. 

 

Later speaking to the media the EO said the seven-day sacred Havanam is being organised by TTD for the first time in the temple city for the well being of the society which will conclude on July 5.

 

He said Rutwiks will chant shlokas from all four Vedas till 1 pm and later devotional program like discourses, bhakti sangeet will be held in the evening everyday. 

 

Program Co-ordinator Aacharya C Sriram Sharma said upon the guidelines given by Kanchi Pontiff all mantras from four Vedas will be recited daily to invoke blessings of all the deities.

 

HDPP Secretary Dr Srinivasulu, Special Officer of SVIHVS Dr A Vibhishan Sharma were also present. 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం

– వేద మంత్రాలతో మార్మోగిన మైదానం

తిరుపతి, 29 జూన్ 2023: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో గురువారం ఉదయం శాస్త్రోక్తంగా శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం ప్రారంభమైంది.

రుత్వికులు కలశ స్థాపన, కలశ ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజమాని సంకల్పం, భక్త సంకల్పం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. 32 మంది రుత్వికులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ హవనం చేశారు. వేద మంత్రాలతో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానం మారుమోగింది. మధ్యాహ్నం 1 గంట వరకు హవనం జరుగుతుంది.

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దంపతులు, జేఈవో శ్రీమతి సదా భార్గవి ఈ కార్యక్రమంలో పాల్గొని సంకల్పం చేసుకున్నారు.

లోక కల్యాణార్థం చతుర్వేద హవనం : టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మా రెడ్డి

లోక కల్యాణార్థం వారం రోజుల పాటు తిరుపతిలో తొలిసారిగా శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం చతుర్వేద హవనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు .
జూలై 5వ తేదీ వరకు ఏడు రోజులపాటు 32 మంది రుత్వికులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. సృష్టిలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ, ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు . భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కార్యక్రమ మార్గదర్శకులు ఆచార్య చిర్రావూరి శ్రీరామ శర్మ మాట్లాడుతూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ, ఆయా దేవతలకు ఆహుతులను ఇవ్వడం ద్వారా సత్ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. కంచి పరమాచార్యులు చెప్పిన నియమాలను పాటిస్తూ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం లోని మంత్రాలను పఠిస్తూ హవనం నిర్వహిస్తున్నామని వివరించారు.

ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, ఎస్వీ ఉన్నతవేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.