శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వెంకన్న చక్రస్నానం
శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వెంకన్న చక్రస్నానం
తిరుపతి, 2023 జూన్ 08: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.
అంతకుముందు ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం ఘనంగా జరిగింది.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ భరత్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.