ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 04 April 2024: Ankurarpanam for the annual Brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati was observed on Thursday evening.
As a part of this ritual Vedaprabandha Sattumora, Senadhipathi Utsavam, Medini Puja were held.
Senior Pontiff of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Parthasaradhi, Chief priest Sri Anandakumar Deekshitulu were also present.
On April 5, the annual fete commences with Dwajarohanam between 8am and 8:25am. Every day there will be Bahana Sevas both in the morning and in the evening.
Garuda Seva is on April 9 while Hanumanta Vahanam on April 10. On April 12 Rathotsavam, and on April 13, the event concludes with Dhwajavarohanam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2024 ఏప్రిల్ 04: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 5న ధ్వజారోహణం :
శుక్రవారం ఉదయం 8 నుండి 8.25 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 7.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
05-04-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
06-04-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
07-04-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
08-04-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
09-04-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం
10-04-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
11-04-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
12-04-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
13-04-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
———————————————————————
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.