MAHA SAMPROKSHANAM OF SRI GT HELD _ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
Tirupati, 23 May 2023: As part of ongoing festivities at Sri Govindaraja Swamy temple in Tirupati, the Maha Samprokshanam was observed on Thursday.
The program included Kumbharadhana, Nivedanam, Homam, and Maha Samprokshanam fete in the auspicious Mithuna Lagnam.
In the evening Pedda Shesha vahanam will be held all along the Mada streets.
Both the Tirumala Pontiffs, temple chief Archaka Sri Srinivasa Deekshitulu, Agama Advisor Sri Seetharamacharyulu, Sri Mohana Rangacharyulu, TTD board member Sri Ashok Kumar, JEO Sri Veerabrahmam, FA&CAO Sri Balaji, DLO Sri Veeraju, DyEOs Smt Shanti, Sri Govindarajan, VGO Sri Manohar, AEO Sri Ravi Kumar, Superintendents Sri Narayana, Sri Mohan Rao, Temple inspector Sri Dhananjeya, Sri Radhakrishna and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి, 2023 మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మే 21 నుండి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబరు 14న పనులు ప్రారంభించారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
గురువారం ఉదయం 4 నుండి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7.45 నుండి 9.15 గంటల వరకు మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనం కల్పించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహా దారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజీ, డిఎల్వో శ్రీ వీర్రాజు, డిప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీ గోవింద రాజన్, ఈఈ శ్రీ మనోహర్, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ధనంజయులు, శ్రీ రాధా కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.