VAKULAMATA TEMPLE MAHA SAMPROKSHANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

TIRUPATI, 23 JUNE 2022: Maha Samprokshanam festivities in Sri Vakulamata temple at Patakalva (Peruru Banda) near Tirupati came to a ceremonious conclusion on Thursday.

In the morning Kumbharadhana and Maha Purnahuti held while in the scheduled Kataka Lagnam between 7:30am and 8:45am Prana Pratistha and Maha Samprokshanam held.

Later Akshatarohanam and Archaka Bahumanam were performed followed by darshan to devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

తిరుప‌తి, 2022 జూన్ 23: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద ( పేరూరు బండపై ) నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం ఉద‌యం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు.

ఉదయం 5.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న నిర్వహించారు. ఉద‌యం 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు క‌ట‌క‌ ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. త‌రువాత అక్ష‌తారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందించారు. మధ్యాహ్నం నుండి భక్తులకు స‌ర్వ‌ద‌ర్శ‌నం కల్పించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.