MAJESTIC KODANDARAMA IN SHIVA DHANUSH ALANKARAM _ శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

Vontimitta, 26 Apr. 21: The ekantha vahana Seva of Sri Kodandaramaswamy temple on Monday, the sixth day of annual Brahmotsavam, was resplendent with utsava idol adorned in shiva Dhanush alankaram.

The TTD is organising the fete as per Covid guidelines heralding the glory of the mythological episode of Sri Rama breaking the mighty Dhanush (bow) of Shiva to wed Sita.

The glittering morning alankaram on the day of the gala event of Sri Sitarama Kalyanam in the evening is a spiritual feast to all devotees.

Thereafter in the afternoon the utsava idols of Swami and his consorts were offered thirumanjanam in ekantham.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 26: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం కనువిందు చేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు కటాక్షించారు.

అనంతరం ఉదయం 11 గంటలకు ఆలయంలో ఏకాంతంగా తిరుమంజనం వేడుకగా నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేయ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.