KAPILESWARA RIDES PEDDASESHA _ శేష వాహనంపై కపిలేశ్వరుడు

శేష వాహనంపై కపిలేశ్వరుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న‌సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.

వాహ‌న సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 25 Feb. 22: Sri Kapileswara Swamy accompanied by Sri Kamakshi Devi, seated on Peddasesha Vahanam blessed the devotees at Sri Kapileswara Swamy temple on Friday evening in Ekantam.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI