శ్రావణమాసంలో తిరుమలలో పండుగల సందడి  

శ్రావణమాసంలో తిరుమలలో పండుగల సందడి  

తిరుమల, 2 ఆగష్టు  2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైయున్న తిరుమల గిరిక్షేత్రము నిత్య కళ్యాణం పచ్చతోరణ వైభవమే. ప్రతిరోజు పండుగ వాతావరణమే.

శ్రీవారి ఆలయంలో ఏడాదిలో 450 కి పైగా ఉత్సవాలు నిర్వహిస్తారు అంటే అతిశయోక్తి కాదు. శ్రావణమాసం ప్రారంభమైనదంటే పండుగల సందడి మిన్నంటుతుంది. అందున తిరుమలలో ఈ పండుగలు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటాయి. ఆగమ ప్రకారంగా అంగరంగ వైభవంగా తిరుమలలో వివిధ పండుగలను నిర్వహించడం ఆనవాయితీ ఈ మాసంలో పండుగ వివరాలు.

ఆగష్టు 10 – నాగులచవితి
ఆగష్టు 11 – గరుడపంచమి/నాగపంచమి/పౌర్ణమి గరుడసేవ
ఆగష్టు 15 – మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి
ఆగష్టు 16 – వరలక్ష్మీవ్రతం
ఆగష్టు 16 నుండి19 వరకు- శ్రీవారి పవిత్రోత్సవాలు  
ఆగష్టు 21 – శ్రావణ పౌర్ణమి
ఆగష్టు 28 – గోకులాష్ఠమి ఆస్థానము
ఆగష్టు 29 – ఉట్లోత్సవం

ఈ ఉత్సవాలే కాకుండా భారత హైందవ సనాతన ధర్మాన్ని ప్రభోదించిన అనేక మంది సిద్దపురుషుల, అవతారపురుషుల జయంతి ఉత్సవాలు కూడా ఆగష్టు నెలలో ఉండడం విశేషం. అందులో భాగంగా ఆగష్టు 11న కశ్యప జయంతి, ఆగష్టు 12న కల్కి జయంతి, ఆగష్టు 21న విఖనస జయంతి కూడా ఉన్నాయి.
    
   తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.