శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం
తిరుపతి, జూలై-1, 2009: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 3వ తేది నుండి 6వ తేది వరకు నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 3నుండి 5వ తేది వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగా 3వ తేదిన ఆలయంలో కవచ అదివాసము, 4వ తేదిన కవచ ప్రతిష్ఠ, 5వ తేదిన కవచ సమర్పణ జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.