ARUDRA DARSHANA MAHOTSAVAM HELD _ శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

TIRUPATI, 06 JANUARY 2023: Arudra Mahotsavam was held in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

Sri Manomani Sameta Sri Nataraja Swamy, Sri Manikyavasaka Swamy was paraded along the streets surrounding the temple.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi, Superintendent Sri Bhupati and others, devotees were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం
 
తిరుపతి 06 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. 
 
ఈ సందర్భంగా తెల్లవారుజామున శ్రీ నటరాజ స్వామివారికి ఏకాంతంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
 
ధనుర్మాస దర్శనం అనంతరం ఉదయం 5.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ మనోన్మణి సమేత నటరాజ స్వామివారు, శ్రీ మాణిక్యవాసక స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం శాస్త్రోక్తంగా దీపారాధన నిర్వహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.