శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, జూలై-16, 2009: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేది వరకు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన వారు ఒక్కొక్కటిక్కెట్టుకు గాను రు.500/- చెల్లించి పాల్గొనవచ్చును. ఒక్కొక్కటిక్కెట్టుకు గాను రు.500/-లు చెల్లించాలి. గృహస్థులకు ఒక అంగవస్త్రము, ఒక రవికె, పవిత్రమాలను, బహుమానంగా ఇస్తారు.
వాల్మీకి పురంలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై26 నుండి 28 వరకు మూడురోజుల పాటు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన గృహస్థులు రు.300/-లు చెల్లించి పాల్గొనవచ్చును. వీరికి ఒక అంగవస్త్రం, ఒక రవికె, అన్న ప్రసాదాలు బహుమానంగా ఇస్తారు.
అదేవిధంగా తితిదే ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంగీత, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.