KALYANAM PERFORMED_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 21 Oct. 19: In connection with Punarvasu star on Monday, the celestial Kalyanotsavam of Sri Kodandarama Swamy and Sita Devi was observed in Sri Kodandarama Swamy temple at Tirupati on Monday morning.

In the evening the deities were taken to Sri Rama Chandra Pushkarini and Unjal seva was performed followed by Asthanam and Pushkarini Harati. 

DyEO Smt Shanti, AEO Sri Tirumalaiah, Superintendent Sri Ramesh and devotees took part.

OCTOBER 27 DEEPAVALI ASTHANAM

Deepavali Asthanam was performed in Sri Kodanda Rama Swamy temple on October 27 in connection with Deepavali at 7pm. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 21:  తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ తిరుమలయ్య,  సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌,  పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అక్టోబర్ 27న దీపావళి ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో అక్టోబర్ 27వ తేదీ అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.