శ్రీగోవిందరాజస్వామివారి ఉప ఆలయాలలో మార్చి 21వ తేదిన మహాసంప్రోక్షణ

శ్రీగోవిందరాజస్వామివారి ఉప ఆలయాలలో మార్చి 21వ తేదిన మహాసంప్రోక్షణ

తిరుపతి మార్చి-20,2009: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉన్న ఏడు ఉప ఆలయాలలో మార్చి 21వ తేదిన మహాసంప్రోక్షణను నిర్వహిస్తారు.

శ్రీగోవిందరాజస్వామివారి ఉపఆలయాలైన శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత పార్థసారధి స్వామివారి ఆలయం, శ్రీఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీవరదరాజస్వామి వారి ఆలయం, శ్రీపుండరీకవల్లి అమ్మవారి ఆలయం, శ్రీవ్యాసాంజనేయస్వామివారి ఆలయం, శ్రీపోటుతాయర్లవారి ఆలయాలలో ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం శనివారం ఉదయం 10.50 నిమిషాలకు వృషభలగ్నమందు నిర్వహిస్తారు.

పై పేర్కొన్న ఆలయాలలోని విమానములన్నింటిని శుభ్రపరిచారు. బింబశుద్ధి చేశారు. అష్ఠబంధనం చేశారు. అనంతరం ఆలయాలన్నింటిని పరిశుభ్రం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.