శ్రీనివాసమంగాపురంలో ఈనెల 12 నుంచి తిరుప్పావడ సేవ

శ్రీనివాసమంగాపురంలో ఈనెల 12 నుంచి తిరుప్పావడ సేవ

తిరుపతి, నవంబర్‌-09, 2009  : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 12వ తేది గురువారం నుంచి తిరుప్పావడ సేవను ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది.

శ్రీనివాసమంగాపురం నందు కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఈనెల 12 నుంచి ప్రతి గురువారం తిరుప్పావడసేవ జరుగనున్నది. ఉదయం రెండవ గంట అనంతరం 8.30 నుండి 9.30 గంటల వరకు ఈ తిరుప్పావడసేవ జరుగుతుంది. ఈ టిక్కెట్టు వెల రు.516/-లు కాగా ఇద్దరిని అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.