శ్రీనివాసమంగాపురంలో రేపు సాక్షాత్కారవైభవం
శ్రీనివాసమంగాపురంలో రేపు సాక్షాత్కారవైభవం
తిరుపతి, జూన్-26, 2009: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్27 నుండి జూన్ 29వరకు వార్షిక సాక్షాత్కారవైభవం వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో మొదటిరోజు 27-6-20098 శనివారం ఉదయంః 8-45 నుండి 10-00వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రంః6-30 నుండి 7-30వరకు ఊంజల్ సేవ ,7-30 నుండి 8-30వరకు నాలుగుమాడవీధులలో తిరుచ్చి ఉత్సవం
రెండవరోజు 28-6-20098 ఆదివారం ఉదయంః 9-00 నుండి 10-00వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రంః6-30 నుండి 7-30వరకు ఊంజల్ సేవ, 8-00 నుండి 9-00వరకు హనుమంతవానంపై ఊరేగింపు
మూడవరోజు 29-6-20098 సోమవారం ఉదయంః 9-15 నుండి 10-15వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రంః6-00 నుండి 7-00వరకు ఊంజల్ సేవ, 8-00 నుండి 9-30వరకు నాలుగుమాడవీధులలో గరుడవాహనంపై ఊరేగింపు.
ఈ మూడురోజులు బొబ్బిలికి చెందిన శ్రీ వి.ఎ.కె.రంగారావు బృందంచే నృత్యనైవేద్య (డాన్స్) కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా తితిదే ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్యప్రాజెక్ట్‌లచే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.