KARTHIKA VANABHOJANAM HELD _  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

TIRUMALA, 27 NOVEMBER 2024: Karthika Vanabhojanam was held in Srinivasa Mangapuram on Wednesday.

As a part of this, Snapana Tirumanjanam was performed to the utsava deities of Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi in the Kalyana Mandapam of the temple itself instead of Paruveta Mandapam following inclement weather conditions. Later Asthanam was performed.

Devotees took part in the Vanabhojanam organised on the occasion.

JEO Sri Veerabrahmam, temple Spl Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and other temple staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

తిరుపతి, 2024 నవంబరు 27: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం, ఆనంతరం ఆస్థానం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన వన భోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూప‌రిండెంట్ శ్రీ ముని బాల‌కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కిర‌ణ్ కుమార్ రెడ్డి, శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.