శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి

శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి

 తిరుపతి, ఆగష్టు -28,  2009: శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 59వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 29వతేదిన ఉదయం 8.30 – 9.00 గంటలకు శ్వేత ఎదురుగా వున్న శ్రీ ప్రభాకరశాస్త్రి గారి కాంశ్య విగ్రహమునకు పూలమాల అలంకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమమునకు పాలకమండలి అధ్యకక్షులు, కార్యనిర్వహణాధికారి, తదితర ప్రముఖులు, పండితులు విచ్చేస్తారు.

మధ్యాహ్నం 2-00 గంటలకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో సారస్వతసభ జరుగును. గౌరవఅతిధులు, శ్రీ వేటూరి ఆనందమూర్తి గారు, ముఖ్య అతిధి మరియు వక్త ప్రొ.శ్రీమతి సి.మహాలక్ష్మి గారు సభను అలంకరిస్తారు. శ్రీ సింగిరాజు సచ్చిదానందం, ప్రొ.సర్వోత్తమ రావు, డా. చెంచుసుబ్బయ్యలు కార్యక్రమములో పాల్గొనగా కళాశాల ప్రిన్సిఫాల్‌ శ్రీమతి   డా. లలితకుమారి అధ్యక్షత వహిస్తారు.
 
శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 29వ తేదిన సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నటించిన  ”విప్రనారాయణ” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.