COMPLETE 84 BHAJAN MANDIRAMS BY DECEMBER END-TTD EO _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 320 భ‌జ‌న మందిరాల నిర్మాణం – టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 04 November 2022: TTD EO Sri AV Dharma Reddy said on Friday that TTD has taken up construction of 320 bhajan mandirams under SRIVANI Trust across different locations in Andhra Pradesh of which 84  mandirams would be completed by  December 2022.

Addressing a review meeting of the SRIVANI Trust along with representatives of the Samarasata Seva Foundation at the TTD Administrative Building, the TTD EO enquired about the second phase works on 111 bhajan mandirs and 209 bhajan mandirs in the third phase under the SS foundation supervision.

He directed SS foundation representatives to speed up the works when he was informed that works on 84 bhajan mandirs are under progress and that rest are still under the stage of documentation.

Among others, he directed officials concerned to complete land acquisition for 209 temples in the third phase and commence works.

He also directed CE to get idols ready for 111 temples in the second phase and train Archakas at SVETA for these temples, scheme parayanadars to visit the bhajan mandirs in their jurisdiction, TTD to provide assistance for Dhoop and Deep services, bhajan mandir committees to submit reports regularly, etc.

TTD JEOs Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, Samarasata Seva foundation President Sri Talluri Vishnu, Secretary Sri Pokala Trinath, Joint Secretary Sri Kota Sunil Kumar, Simhapuri zone Co convenor Sri K Reddappa Rao, Representatives, Sri Venkateswara Reddy and Sri Aditya were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 320 భ‌జ‌న మందిరాల నిర్మాణం

– డిసెంబ‌రు నాటికి 84 పూర్తి చేయాలి

– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2022 న‌వంబ‌రు 04: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 320 భ‌జ‌న మందిరాలు నిర్మించ‌నున్న‌ట్టు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందులో డిసెంబ‌రు నాటికి 84 భ‌జ‌న మందిరాల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు, టిటిడి అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స‌మ‌ర‌స‌త ఫౌండేష‌న్ నేతృత్వంలో రెండో విడ‌త 111, మూడో విడ‌త‌లో 209 భ‌జ‌న మందిరాల నిర్మాణ‌ప‌నుల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. రెండో విడ‌త‌కు సంబంధించి 84 భ‌జ‌న మందిరాల‌ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, మిగిలిన‌వి డాక్యుమెంటేష‌న్ స్థితిలోనే ఉన్నాయ‌ని, వీటి ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. మూడో విడ‌త‌లోని 209 భ‌జ‌న మందిరాల స్థ‌ల సేక‌ర‌ణ ప‌నులు పూర్తి చేసి త్వ‌ర‌లోనే వాటి నిర్మాణ‌ప‌నులు కూడా ప్రారంభించాల‌న్నారు. రెండో విడ‌త‌లో పూర్తికానున్న 111 భ‌జ‌న మందిరాల‌కు విగ్ర‌హాల‌ను సిద్ధం చేయాల‌ని సిఇని ఆదేశించారు. వీటిలో అర్చ‌కులుగా ప‌నిచేయ‌బోయేవారికి శ్వేత‌లో అర్చ‌క శిక్ష‌ణ ఇవ్వ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స్కీమ్ వేద‌పారాయ‌ణ‌దారులు త‌మ ప‌రిధిలోని భ‌జ‌న మందిరాల‌ను సంద‌ర్శించేలా చూడాల‌న్నారు. వీటికి ధూప‌దీప నైవేద్యాల కోసం టిటిడి స‌హ‌కారం అందిస్తుంద‌ని చెప్పారు. భ‌జ‌న మందిరాల నిర్మాణానికి ఏర్పాటుచేసిన క‌మిటీ త్వ‌ర‌గా ప‌రిశీల‌న జ‌రిపి నివేదిక అందించాల‌ని కోరారు. నిర్మాణం ప్రారంభం కాని ప్రాంతాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో చ‌ర్చించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి నిర్మాణాలు ప్రారంభించాల‌న్నారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, స‌మ‌ర‌స‌త ఫౌండేష‌న్ అధ్య‌క్షులు శ్రీ తాళ్లూరి విష్ణు, కార్య‌ద‌ర్శి శ్రీ పాకాల త్రినాథ్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ కోట సునీల్‌కుమార్‌, సింహ‌పురి జోన్ స‌హ క‌న్వీన‌ర్ శ్రీ కె.రెడ్డెప్ప‌రావు, ప్ర‌తినిధులు శ్రీ వెంకటేశ్వ‌ర‌రెడ్డి, శ్రీ ఆదిత్య పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.