CONSTRUCTION OF 3615 TEMPLES WITH SRIVANI TRUST- TTD EO _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం

DEVOTEES OF BACKWARD REGIONS HAPPY

SOCIAL AUDIT CONDUCTED

Tirupati, 14 December 2023: TTD EO Sri AV Dharma Reddy said that under the auspices of Sri Venkateswara Alaya Nirmana Trust (SRIVANI), TTD has so far commissioned construction and rejuvenation of 3615  temples.

Addressing a review meeting at the TTD administrative building on Thursday evening the EO said so far construction of 1500 temples while another 1973 temple works were taken up by the Endowments Department.

He urged officials to ensure the completion of the remaining temples also as per schedule.

The representatives of Samarasata Seva Foundation Sri Vishnu and Sri Trinath expressed that the people of backward regions where these temples were constructed are immensely happy. They also said Social Audit of these temples have also been carried out.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FACAO Sri Balaji, CAuO Sri Sesha Sailendra and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం

– సామాజిక త‌నిఖీ నిర్వ‌హ‌ణ‌

– వెనుక‌బ‌డిన ప్రాంతాల భ‌క్తుల సంతోషం

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 14: టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం, ప‌లు ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గురువారం ఆల‌యాల నిర్మాణంపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 1500 ఆల‌యాల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన ఆల‌యాల నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల‌ని అధికారులను కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆల‌యాల‌ను నిర్మించింద‌న్నారు. స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ 320 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టి 307 ఆల‌యాల‌ను పూర్తి చేసింద‌ని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు క‌మిటీలుగా ఏర్ప‌డి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆల‌యాల నిర్మాణానికి ఆర్థిక‌సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు. వీటితోపాటు ప‌లు న‌గ‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు నిర్మించామ‌ని తెలియ‌జేశారు. స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్‌కు మ‌రికొన్ని ఆల‌యాల నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు యోచిస్తున్నామ‌న్నారు.

స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ శ్రీ‌విష్ణు మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో ఎస్‌సి, ఎస్‌టి కాల‌నీలు, కొండ ప్రాంతాలు, స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో నిర్మించిన ఆల‌యాల్లో మూడు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థ‌ల ద్వారా సామాజిక త‌నిఖీ(సోష‌ల్ ఆడిట్) చేశారని చెప్పారు. ఇందులో భాగంగా ఆల‌యాల నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా జ‌రుగుతోంద‌ని, భ‌క్తులు ఎంతో సంతోషంగా ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటున్నార‌ని, గ్రామాల్లో విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌లు క‌ల‌సిమెల‌సి ఉంటున్నార‌ని సామాజిక త‌నిఖీల్లో వెల్ల‌డైంద‌ని, ఇది ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. నూత‌న ఆల‌యాలు, జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టిన ఆల‌యాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వ‌ర్గానికి చెందినవారిని అర్చ‌కులుగా నియ‌మించారని వెల్ల‌డించారు. ఈ ఆల‌యాల్లో ధూప‌దీప నైవేద్యాల కోసం శ్రీ‌వాణి ట్ర‌స్టు నుండి ప్ర‌తి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ స‌మీక్ష‌లో స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ త్రినాథ్‌, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయబడినది.