SOCIAL AUDIT OF TEMPLES BUILD UNDER SRIVANI TRUST – TTD EO _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీ – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 15 February 2024:  TTD EO Sri.AV Dharma Reddy on Thursday said that a social audit was conducted in the temples built in some districts recently with the funds of Sri Venkateswara Alaya Nirmana Trust (Srivani) of TTD and the overwhelming happiness has been witnessed among the villagers. 

The EO conducted a review of the construction of temples at the TTD administration building in Tirupati on Thursday.

On this occasion, the EO said that the construction of 320 temples in the areas of fishermen, tribals and backward classes has been completed under the auspices of Samarasatha Seva Foundation through Srivani Trust.  He said that about Rs.26 crores have been spent on this.  He said the social audit was done by leading Chartered Accountant firms registered with The Institute of Chartered Accountants of India, a statutory system established by the Government of India.

He said that these organizations have prepared a questionnaire with 50 questions and collected opinions from the people of the surrounding areas of all the temples.  After examining the opinions of the people, it was explained that the construction of the temples made them happy and that they were contributing to the propagation of Hindu Dharma by regularly going to the temples, performing pujas, bhajans and festivals.  The villagers expressed their views that after the construction of the temples in the respective villages, there was a sense of divinity.  He said that it is clear that conversions have almost stopped in those areas.

Propagation of Hindu Dharma through the construction of temples in fishing, tribal and backward areas is a milestone in the history of TTD.

TTD JEO Sri. Veerabrahmam, FACAO Sri. Balaji, DLO Sri. Veeraju, CAuO Sri. Seshashailendra, All Projects Program Officer Sri. Rajagopal and others participated in this meeting.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీ

– గ్రామాల్లో వెల్లివిరుస్తున్న ఆనందోత్సాహాలు

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 15: టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) నిధులతో ఇటీవల కొన్ని జిల్లాల్లో నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామని, ఆయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గురువారం ఆల‌యాల నిర్మాణంపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మత్స్యకార, గిరిజన, వెనుకబడిన తరగతులు ఉన్న ప్రాంతాల్లో 320 ఆలయాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇందుకోసం దాదాపు రూ.26 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. భారత ప్రభుత్వంచే ఏర్పాటైన చట్టబద్ధమైన వ్యవస్థ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో నమోదైన ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా సామాజిక తనిఖీ చేయించినట్టు తెలిపారు.

ఈ సంస్థలు 50 ప్రశ్నలతో ప్రశ్నావళి రూపొందించి అన్ని ఆలయాల పరిసర ప్రాంతాల ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టాయన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిశీలించగా, ఆలయాల నిర్మాణం వారికి ఆనందం కలిగించిందని, క్రమం తప్పకుండా ఆలయాలకు వెళ్లి పూజలు, భజనలు, ఉత్సవాలు నిర్వహిస్తూ హిందూ ధర్మ ప్రచారానికి దోహదపడుతున్నారని తెలిసిందని వివరించారు. ఆయా గ్రామాల్లో ఆలయాలు నిర్మించిన తర్వాత దివ్యానుభూతి కలిగిందని గ్రామస్తులు తమ అభిప్రాయాలను తెలియజేశారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మతమార్పిడులు దాదాపుగా ఆగిపోయాయని స్పష్టమైందని తెలిపారు. ఆలయాల నిర్మాణం ద్వారా మత్స్యకార, గిరిజన, వెనకబడిన ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయడం టీటీడీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, డిఎల్వో శ్రీ వీర్రాజు, సీఏవో శ్రీ శేషశైలేంద్ర, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.