SADHUS HAIL TTD FOR UTILIZING SRIVANI FUNDS TOWARDS THE CONSTRUCTION OF TEMPLES IN BACKWARD AREAS_ శ్రీవాణి నిధులతో వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణంపై పీఠాధిపతుల ప్రశంస
“DON’T PLAY WITH THE SENTIMENTS OF DEVOTEES FOR POLITICAL GAINS”
OVER 8.25LAKH DEVOTEES HAD DARSHAN THROUGH SRIVANI SO FAR-TTD EO
TIRUMALA, 22 JUNE 2023: The Peethadhipathis hailing from different Peethams and Viswa Hindu Parishad (VHP) leaders hailed TTD for utilising every single penny of SRIVANI funds towards the construction of temples in SC, ST, BC, fishermen and backward areas.
Addressing media persons at Annamaiah Bhavan in Tirumala on Thursday, the TTD EO Sri AV Dharma Reddy along with Peethadhipathis and VHP leaders held a media conference to counter the allegations made by some vested interests for political means on the misuse of SRIVANI funds.
Sri Raghavulu, the VHP National Joint Secretary speaking to the media said, “Our temples are the centres of Santana Hindu Dharma. In the good old days, temples used to act as the centres of Bhojanasala, Dharamasala, Vaidyasala, Vedasala, Mallasala, Yogasala and Gosala. TTD being the biggest social reformer besides its spiritual activities, has taken up various social welfare activities. Being Hindus we all should support the noble cause. Without knowing the facts we should not make baseless allegations as it would hurt the sentiments of millions of devotees. We had a fact check with respect to the alleged misuse of SRIVANI funds and were happy to inform you that every single penny is being utilized in constructing new temples and restoring the ancient ones through the SRIVANI funds”, he maintained.
Sri Swaswaroopanandagiri Swamy of Lalitha Peetham, Srinivasa Mangapuram, Sri Virajananda Swamy of Brahmamgari Mutt, Kadapa, Sri Durgaprasada Swamy, Hanumat Peetham, Hyderabad speaking to media said following the recent allegations about the misuse of SRIVANI funds, to clarify our doubts as Srivari devotees, we came to Tirumala and met the TTD EO Sri AV Dharma Reddy. After going through the details of Bank Accounts and temples constructed under SRIVANI Trust funds provided by TTD, we are happy to assert that there is absolutely no misappropriation of funds. If anyone has any doubts, before making baseless allegations, we appeal to them to come and know the facts. Otherwise, it would impact on the sentiments of common devotees which is not good to our own religion”, they alarmed.
Later Sri Ramanjaneyulu, the MD of Solis Eye Care, Hyderabad, said “As a common devotee, I have been coming for Darshan of Sri Venkateswara Swamy from the past four decades. I also had darshan under SRIVANI many times. Before going through the Account details even I had many doubts about the misuse of funds. But now I am immensely satisfied that every single paisa of devotees donated to this Trust is being utilized in the construction of temples in backward areas by TTD”, he maintained.
TTD EO Sri AV Dharma Reddy reiterated that devotees who have any doubts pertaining to the utilization of SRIVANI Trust funds shall approach TTD and get the details. He appealed to them not to fall prey to baseless allegations. “In the last four years, over 8.25lakh people had darshan in both online and offline through SRIVANI Trust. As alleged by some persons, is it possible to cheat these devotees without giving proper receipts? Will the devotees sit quiet if don’t give them the correct receipts? A Trust is usually formed with many norms and guidelines. We are generating separate receipts for donation and darshan tickets. One should think carefully before making such baseless allegations otherwise it would hurt millions of devotees”, he cautioned.
VGO Sri Bali Reddy, Annaprasadam Catering Special Officer Sri Shastry, many other representatives from VHP, Patanjali Yoga etc. were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవాణి నిధులతో వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణంపై పీఠాధిపతుల ప్రశంస
– రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి
– 8.25 లక్షల మందికిపైగా భక్తులకు శ్రీవాణి ద్వారా దర్శనం
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 జూన్ 22: సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశంసించారు. టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయకండని విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ రాఘవులు హెచ్చరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి వీరు మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఈ సందర్భంగా శ్రీ రాఘవులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని తెలియజేశారు.
అదేవిధంగా, శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీ విరజానందస్వామి, హైదరాబాదుకు చెందిన శ్రీ హనుమత్ పీఠం పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద స్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు, ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మాణం జరుగుతోంది, ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి, వడ్డీ ఎంత వచ్చింది తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందని, నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూ ధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు.
హైదరాబాదుకు చెందిన సోలిస్ ఐకేర్ ఎండి శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని, భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని వివరించారు.
టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటు అవుతుందని, ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టికెట్‌కు వేరువేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాది మంది భక్తులు విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.
మీడియా సమావేశంలో విహెచ్‌పి, ఆర్ఎస్ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీ శ్రీధర్ రావు, శ్రీమతి మురళి, శ్రీ దీపక్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్, శ్రీ సుబ్బన్న, శ్రీ సురేష్, శ్రీ కుమారస్వామి, టీటీడీ విజివో శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.