BATTERY 2 – WHEELER DONATED _ శ్రీవారికి బ్యాటరీ ద్విచక్ర వాహనం విరాళం
Tirumala, 16 Jul. 20: Sri Srinivas TVS Agency from Tirupati has donated a battery-operated Two-wheeler worth around Rs 1.40lakhs to TTD on Thursday.
The donors Sri Bhaktavatsala Naidu and Sri Siddharth presented keys of the vehicle to the TTD Chairman Sri YV Subba Reddy in front of the Srivari temple.
TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri Dharma Reddy, DI Mohan and others participated.
The battery-operated 2 wheeler has been allocated for Srivari Seva Sadan 1 office.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారికి బ్యాటరీ ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల, 2020 జూలై 16: తిరుమల శ్రీవారికి గురువారం బ్యాటరీ ద్విచక్రవాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాస టివిఎస్ ఎజన్సిస్ నిర్వాహకులు ఈ మేరకు దాదాపు రూ.1.4 లక్షల విలువైన టివిఎస్ సంస్థకు చెందిన ఐక్యూ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు శ్రీ భక్తవత్సల నాయుడు, శ్రీ సిద్ధార్థ ఈ మేరకు ద్విచక్రవాహనం తాళాలను టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని తిరుమల శ్రీవారి సేవసదన్ – 1 కార్యాలయ అవసారాల నిమిత్తం సిబ్బంది వినియోగించుకోనున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.