శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టికెట్ల సంఖ్య 500

శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టికెట్ల సంఖ్య 500

తిరుమల, 2010 జూలై 24: తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం కొఱకు ఇచ్చే టికెట్ల సంఖ్య 750 నుండి 500 వరకు తగ్గించడం జరిగింది.

గత కొన్ని నెలలుగా ‘డయల్‌ యువర్‌ ఇఓ’ కార్యక్రమాల్లో ఫోన్లు ద్వారా తాము అంగప్రదక్షిణం పూర్తిగా చేయలేకపోతున్నామని, హుండీవద్దకు వచ్చే సరికే పైకి లేపుతున్నారని తద్వారా తమ మొక్కు పూర్తిగా నెరవేర్చలేక పోతున్నామని భక్తులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

భక్తుల విజ్ఞప్తిని దృష్ఠిలో వుంచుకొని అంగప్రదక్షిణం కొఱకు జారీ చేసే టిక్కెట్ల సంఖ్యను 500కు కుదించడం జరిగింది. భక్తులు ఈ మార్పును గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.