శ్రీవారి ఆలయంలో జూలై 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో జూలై 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2020  జూలై 13: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 14న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. 

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు

జాలై 14న ఉద‌యం ఆల‌య శుద్ధి కార్య‌క్ర‌మాన్ని అర్చ‌కులు ఆగ‌మోక్తంగా నిర్వ‌హిస్తారు. 
                       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.