BHASHYAKARA UTSAVAM HELD _ శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర

Tirumala, 12 May 2024: Sri Bhashyakara Sattumora was held in a grand manner at Tirumala Srivari Temple on Sunday.  
 
Bhashyakarla Sattumora is held every year in honour of the birth start of the great Sri Vaishnava Saint on the advent of Arudra Nakshatra in the month of Vaisakha.
 
On this occasion, in the morning, Sri Bhashyakara was taken out on a procession along the four Mada streets of the temple.  
 
After that, Abhishekam was performed in the shrine of Sri Bhashyakar in the footpath route.
 
After the Sahasra Deepalankara Seva in the evening, Sridevi Bhudevi along with Sri Malayappa Swami on one Tiruchi and Sri Bhashyakara on another Tiruchi were taken on a procession through the streets of the temple.  
 
After that they circumambulate around the vimana prakaram of the temple.  At night from 7.30 to 9.30 pm Sathumora will be performed in the  Bhashyakara Sannidhi.  
 
Tirumala Sri Sri Peddajeeraswamy, Sri Sri Chinnajeeraswamy and other officials participated in this program.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

తిరుమల, 2024 మే 12: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.