శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం

తిరుమల, 2010 నవంబర్‌ -04: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్‌ 5వ తేదిన దీపావళి ఆస్థానం వైభవంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా నవంబర్‌ 5వ తేదిన శ్రీవారి ఆలయంలో నిజపాదసేవ, ఆర్జితసేవలైన తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలు నిర్వహించరు. అయితే సుప్రభాతర, సహస్రదీపాలంకర సేవలు యథావిధిగా నిర్వహిస్తారు.

దీపావళి ఆస్ధానం సందర్భంగా  ఈ రోజు ఆలయంలో ఉదయం 1 గంటకు సుప్రభాతం, 4 గంటలకు బంగారు వాకిలి వద్ద ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు, సేనాధిపతి వారికి ఏకాంత తిరుమంజనం, 6 గంటలకు విశేష సమర్పణ, 7 గంటలకు ఆలయంలో విశేషపడి ఊరేగింపు, ఉదయం 7 నుండి 9 గంటల మద్య శ్రీ మలయప్ప స్వామివారికి, మూలవర్లకు విశేష నూతన వస్త్ర సమర్పణ, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలు నిర్వహిస్తారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.