Press Release on GOKULASTMI _ శ్రీవారి ఆలయంలో వార్షిక గోకులాష్టమి
Tirumala, Aug 11,2009: The Annual Gokulastmi will be celebrated in Sri Vari Temple, Tirumala on Aug 14. In view of Gokulastmi, special programmes such as Ekantha Tirumantha Tirumanjanam to Sri
Ugra Srinivasa Murthy, Sri Devi, Bhudevi ammavarlu, and Sri Krishna Swamy Varu between 8PM to 10PM on Aug 14.
In view of this Utsavam, Utlotsavam will be conducted in Sri Vari Temple, Tirumala on Aug 15. Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam, Sahasra Deepalankara Seva are cancelled. Procession of Sri Malayappaswamy Varu on Golden Tiruchi, Sri Krishna Swamy varu on another tiruchi in between 1PM to 5PM on Aug 15 around four Mada streets in Tirumala. Later Asthanam will be conducted in the Temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో వార్షిక గోకులాష్టమి
తిరుమల, ఆగష్టు -11, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక గోకులాష్టమి ఆస్థానం ఆగష్టు 14వ తేదిన, ఉట్లోత్సవం ఆగష్టు 15వ తేదిన వైభవంగా నిర్వహిస్తారు.
గోకులాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో రాత్రి 8 నుండి 10 గంటల మద్య శ్రీఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి బంగారు వాకిలి వద్ద ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణస్వామి వారికి నైవేద్యం, ప్రబంధసాతుమొర, పురాణ ప్రవచనము, బంగారు వాకిలి వద్ద ఆస్థానం నిర్వహిస్తారు.
ఆగష్టు 15వ తేదిన ఉట్లోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు అయిన కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఉదయం 3.30 నుండి 7.30 గంటల మద్య ఆలయంలో శ్రీకృష్ణస్వామి వారికి తైల సమర్పణ, మాడ వీధులలో ఊరేగింపు ఉంటుంది. అదే విధంగా మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల మద్య బంగారు తిరుచ్చి పై శ్రీమలయప్ప స్వామి వారు, మరొక్క తిరుచ్చి పై శ్రీకృష్ణస్వామి వారు తిరువీధులలో తిరుగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.