ASTHANAM HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirumala, 18 April 2024: Sri Rama Pattabhisheka Asthanam was held in Tirumala temple on Thursday evening.

The Vedic Pundits read out the coronation ceremony of Sri Rama on the occasion.

This event took place at Bangaru Vakili inside the temple between 8pm and 9pm in front of Sri Sita Rama Lakshmana and Anjaneya Utsava Murthies. Later the Utsava Murthies of the other legendary Monkey kings, Sugreeva and Angada were also offered floral garlands along with Lord Hanuman.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2024 ఏప్రిల్ 18: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు విశేష సమ‌ర్ప‌ణ చేప‌ట్టారు. సాయంత్రం 5 గంటలకు స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు.

రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంత‌రం సుగ్రీవుడు, అంగ‌దుడు ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి వారితోపాటు ఆంజ‌నేయ‌స్వామివారికి పుష్ప‌మాల‌లు స‌మ‌ర్పించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.