KAISIKA DWADASI ASTHANAM HELD IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
Tirumala, 21 November 2026: On the auspicious occasion of Kaisika Dwadasi, the temple court was held in a religious manner inside Srivari temple at Tirumala on Saturday morning.
Earlier, between 4:30 AM and 5:45 AM, the Sri Ugra Srinivasa Murthy along with Sri Devi and Bhu Devi were taken in a procession around the temple four mada streets, blessing the devotees.
As per tradition, Ugra Srinivasa Murthy also known as “Venkatathuraivar” or “Snapana Beram”. These idols will be taken in a procession along the mada streets only once in a year, and that too before sunrise on this auspicious day of Kaisika Dwadasi.
After the procession, the deities were brought near the Bangaru Vakili and the priests conducted the Asthanam with the recitation of the Kaisika Purana.
Significance:
Kaisika Dwadasi is one of the most important festivals in Sri Vaishnava tradition. According to Kaisika Purana, Sri Varaha Swamy explained the story in 82 verses to Sri Bhudevi. From this, Kaisika Dwadasi gained its special importance.
Bhakta Nambaduvan Story:
Nambaduvan, an ardent devotee, promised a Brahma Rakshasa(Demon) that after rendering Sankeertans in Kaisika Raagam before his deity to Sri Maha Vishnu, he would return to him to become the Demon’s feed.
Nambaduvan kept his word and returned. Sri Maha Vishnu (Sri Venkateswara in Kaliyuga) blessed Nambaduvan for his truthfulness and devotion and granted salvation.
Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy,
TTD Specified authority Chairman and EO Sri Muddada Ravi Chandra, JEO Dr.Sharath CV&SO Sri Murali Krishna and other officers participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం
తిరుమల, 2026 నవంబర్ 21: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.





