ANIVARA ASTHANAM FETE HELD IN TIRUMALA_ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

SILKS PRESENTED FROM SRI RANGAM TEMPLE

Tirumala, 17 July 2023: Anivari Asthanam – the traditional fete of commencement of annual accounts of Srivari temple was held at Bangaru vakili on Monday in Tirumala in the presence of Tirumala pontiffs  Sri Sri Sri Pedda Jeeyarswami,  Sri Sri Sri Chinna Jeeyarswami and TTD EO Sri AV Dharma Reddy.

Earlier the utsava idols of Sri Malayappa Swami and His consorts mounted on Sarva Bhupala Vahanam were seated at the Ganta Mandapam in Bangaru Vakili along with Sri Viswaksena the commander in chief of Sri Venkateswara. Later special pujas performed to the Mula Virat and utsava idols and Prasada Nivedana was offered.

Thereafter the senior Tirumala pontiff carried six pattu vastrams in a silver plate on his head entered srivari temple amidst mangala vaidyams followed by his deputy and EO wherein four pattu silks were decorated to the Mula Virat, while one to Sri Malayappa and another one to Sri Viswaksena utsava idols.

As part of festive tradition, temple chief archaka wore “Parivattam” and spelt blessing “Nitya Aisharyobhava”. Later archakas handed over “Lacchanna” – a key bunch of the temple to Tirumala pontiffs and TTD EO. The Anivavara Asthanam fete concluded when the temple key bunch was placed at Srivari feet after a series of Harati, chandanam, tamboolam, thirtha offerings. Day of accounting: TTD EO

Speaking on the occasion, the TTD EO said in the past the custodians of Srivari temple, Mahants, kept accounts of income, expenses, reserves on annual basis. Only after the TTD board set up, the annual accounting shifted to the March-April format.

TTD board members Sri Muramsetti Ramulu, Sri Maruti Prasad, Devathanams Law Officer Sri Veeraju, SE-2 Sri Jagadeeswar Reddy, temple DyEO Sri Lokanathan, Health Officer Dr Sridevi and others were present.

SRIVARI TEMPLE GETS SILKS PRESENTS FROM SRIRANGAM TEMPLE

As part of  Vaikhanasa customs on Anivara Asthanam fete the temple officials of Sri Ranganatha Swami temple of Srirangam, Tamilnadu presented pattu vastrams to Srivaru.

Earlier the pattu vastram were offered special pujas at the Sri Bedi Anjaneya Swamy temple. Then Tamilnadu Endowments minister Sri Shekar Babu accompanied by Tirumala junior pontiff Sri Sri Sri Chinna Jeeyarswami and TTD EO amidst Mangala Vaidyams carried them on a procession on Mada streets before entering Srivari temple.

Tamilnadu Endowments Secretary Sri Manivasagam, Commissioner Sri Muralidharan, Srirangam Temple Joint Commissioner Sri Sivram Kumar and Archaka Sri Srinivas Raghav Bhattar were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

– వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

– శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల, 2023, జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టీటీడీ ఈవో

ఈ ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుపల ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, లా ఆఫీసర్ శ్రీ వీర్రాజు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సోమవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్ బాబు, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ మణివాసగం, కమిషనర్ శ్రీ మురళీధరన్, శ్రీరంగం ఆలయ ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ శివరాం కుమార్, అర్చకులు శ్రీ శ్రీనివాస రాఘవ భట్టర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.