శ్రీవారి ఆలయంలో 22వ తేది కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం 

శ్రీవారి ఆలయంలో 22వ తేది కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, డిశెంబర్‌-17, 2009: ఈనెల 28వ తేదిన వైకుంఠ ఏకాదశిన పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో 22వ తేది మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో 4 సార్లు తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఇదొక మహాయజ్ఞంగా జరుగుతుంది.

ఆలయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే సుగంధపరిమళ విశ్రమాన్ని శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, ఖిలిచిగడ్డ తదితర వస్తువులతో తయారు చేస్తారు. ఈ లేహ్యాన్ని ఆలయంలోని అన్ని గోడలకు పూసి శుభ్రం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.